బిగ్ బాస్ చెప్పినా మాట ని తిరస్కరించాను...వరస్ట్ పర్ఫార్మర్ నేనే:అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొదలై 90 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది.అయితే 89వ ఎపిసోడ్ లో లెవెల్ 03 కి వెళ్లిన అఖిల్ మరియు సోహైల్ ల కు టాస్క్ ఇచ్చి అభిజీత్ ని సంచాలకుడిగా వ్యవహించమనీ కోరాడు.టాస్క్ లో భాగంగా బజర్ మోగగానే అఖిల్,సోహైల్ లు ఇద్దరు బయట గార్డెన్ లో ఉన్న ఉయ్యాలలో కూర్చోవాలని మరియు బిగ్ బాస్ చెప్పే పనులు ఉయ్యాలపై ఉండి చేయాలని...ఎవరు ఉయ్యాల నుండి ముందు దిగుతారో వారు టాస్క్ లో ఓడిపోయినట్లుగా బిగ్ బాస్ తెలియచేస్తారు. ఇక బజర్ మోగగానే ఇద్దరు వెళ్లి ఉయ్యాలలో కూర్చుంటారు,బిగ్ బాస్ అభిజీత్ ద్వారా అఖిల్,సోహైల్ ల కు మొదట స్వీటర్లు పంపించి వాటిని ధరించవలసిందిగా మరియు ఆ స్వీటర్ల పై నుండి వారి దగ్గర ఉన్న దుస్తులు ధరించవల్సిందిగా చెప్తాడు. అలా ఆ తర్వాత రాడిష్ జ్యూస్ పంపించి దానిని ఒకరికి ఒకరు తాగిపించుకుంటూ వాళ్ళు ఆ ఉయ్యాల పై కూర్చోవడానికి ఎందుకు అర్హులో మరియు ఎదుటి వారు ఎందుకు కారో చెప్పవలసిందిగా బిగ్ బాస్ చెప్తాడు...ఇక అఖిల్,సోహైల్ లు అంత పెద్ద కారణాలు ఎం లేవు మా మధ్య అని చెప్తూ ఒక...