బిగ్ బాస్ చెప్పినా మాట ని తిరస్కరించాను...వరస్ట్ పర్ఫార్మర్ నేనే:అభిజీత్
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొదలై 90 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది.అయితే 89వ ఎపిసోడ్ లో లెవెల్ 03 కి వెళ్లిన అఖిల్ మరియు సోహైల్ ల కు టాస్క్ ఇచ్చి అభిజీత్ ని సంచాలకుడిగా వ్యవహించమనీ కోరాడు.టాస్క్ లో భాగంగా బజర్ మోగగానే అఖిల్,సోహైల్ లు ఇద్దరు బయట గార్డెన్ లో ఉన్న ఉయ్యాలలో కూర్చోవాలని మరియు బిగ్ బాస్ చెప్పే పనులు ఉయ్యాలపై ఉండి చేయాలని...ఎవరు ఉయ్యాల నుండి ముందు దిగుతారో వారు టాస్క్ లో ఓడిపోయినట్లుగా బిగ్ బాస్ తెలియచేస్తారు.
ఇక బజర్ మోగగానే ఇద్దరు వెళ్లి ఉయ్యాలలో కూర్చుంటారు,బిగ్ బాస్ అభిజీత్ ద్వారా అఖిల్,సోహైల్ ల కు మొదట స్వీటర్లు పంపించి వాటిని ధరించవలసిందిగా మరియు ఆ స్వీటర్ల పై నుండి వారి దగ్గర ఉన్న దుస్తులు ధరించవల్సిందిగా చెప్తాడు.
అలా ఆ తర్వాత రాడిష్ జ్యూస్ పంపించి దానిని ఒకరికి ఒకరు తాగిపించుకుంటూ వాళ్ళు ఆ ఉయ్యాల పై కూర్చోవడానికి ఎందుకు అర్హులో మరియు ఎదుటి వారు ఎందుకు కారో చెప్పవలసిందిగా బిగ్ బాస్ చెప్తాడు...ఇక అఖిల్,సోహైల్ లు అంత పెద్ద కారణాలు ఎం లేవు మా మధ్య అని చెప్తూ ఒకరి ఒకరు జ్యూస్ తాగిపించుకుంటూ చిన్న చిన్న కారణాలు చెప్పుతూ జ్యూస్ మొత్తం తాగేస్తారు...ఇక ఈ టాస్క్ రెండవ రోజు అనగా 90వ ఎపిసోడ్ లో కూడా కొనసాగడం అఖిల్ కోసం సోహైల్ ఉయ్యాల దిగిపోవడం జరుగుతుంది.దాంతో బిగ్ బాస్ అఖిల్ ని బిగ్ బాస్ ఫినాలే లో కి చేరిన మొదటి కంటస్టెంట్ గా ప్రకటిస్తాడు...
ఇక 90 వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి టాస్క్ ఇస్తాడు...టాస్క్ లో భాగంగా హౌస్ సభ్యులు గార్డెన్ లో ఉన్న ర్యాంక్ లపై నిల్చోవలసిందిగా తర్వాత వాళ్ళు ఆ ర్యాంక్ ని ఎందుకు ఎంచుకున్నారో చెప్పవలసిందిగా బిగ్ బాస్ చెప్తాడు మరియు అఖిల్ అప్పటికే ఫైనల్ కంటస్టెంట్ జాబితాలో చేరిన కారణంగా అఖిల్ ఆడనవసరం లేదు అని మిగతా 6 సభ్యులు మాత్రమే ఆడవాల్సిందిగా బిగ్ బాస్ చెప్తాడు.
ఇక సోహైల్ ఒకటవ ర్యాంక్ పై నిల్చొని నేను అన్ని తస్కలలో 100% ఇచ్చాను కాబట్టి నాకు ఒకటవ రాంక్ కావాలని
చెప్పగా...అరియానా సోహైల్ ని ఒకటవ ర్యాంక్ కోసం అడగగా తాను నిరాకరిస్తాడు...ఇక అరియానా రెండవ ర్యాంక్ లో కొనసాగుతుంది..ఇక మొదట హారిక మూడవ రాంక్ పై నిల్చొని మోనాల్ అడగగానే ఇచ్చేసి నాల్గవ ర్యాంక్ కి వచ్చేస్తూ బిగ్
బాస్ ని మరియు హౌస్ మేట్స్ ని "ఇక్కడ ఇంకా ర్యాంక్ కోసం ఫైట్ చేసే స్టేజి లో ఎవరైనా ఉన్నారా?" అని ఏడుస్తూ అడుగగానే సోహైల్ మరియు అరియానా లు స్పందించి బిగ్ బాస్ ఇక ఈ మెంటల్ టార్చర్ వొద్దు మేము ఇప్పటికే శారీరకంగా మరియు మానసికంగా నలిగిపోయాం అంటారు.
ఇక అభిజీత్ నేను ఆరవ ర్యాంక్ సరి అయిన వాడిని ఎందుకంటే నేను మీరు ఇచ్చిన టాస్క్ ని చేయలేకపోయాను ఒకవేళ ఆ టాస్క్ చేసి ఉంటె నెను కచ్చితంగా మొదటి ర్యాంక్ కోసం కొట్లాడే వాడినని చెప్పగా అవినాష్ ఐదవ ర్యాంక్ లో ఉండి పోతాడు...బిగ్ బాస్ సోహైల్ ని బెస్ట్ పెరఫార్మెర్ గా మరియు అభిజీత్ ని వరస్ట్ పెరఫార్మెర్ గా ప్రకటిస్తూ అభిజీత్ ని జైలు కి పంపించేస్తాడు.
Comments
Post a Comment