Skip to main content

ఆ మూడు చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదు:జయ ప్రకాష్ నారాయణ

 ఆ మూడు చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదు:జయ ప్రకాష్ నారాయణ



కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బిల్లులపై లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు స్పందించారు.ఆ బిల్లులు కేవలం రైతుల ప్రయోజనాల కోసమే అని,అనవసరమైన ప్రలోబాలకి రైతులు గురికావోద్దని మరియు కొన్ని రాజకీయ పార్టీ లు రైతుల భుజాలపై తుపాకులు పెట్టి పెలుస్తున్నారని విమర్శించారు.ఈ బిల్లులలో కేవలం రైతులు తాము పండించిన పంటని దేశానలుములలలో ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు అని ఉంది కాని ప్రస్తుతం ఉన్న మార్కెట్లని రద్దు చేస్తారని ఎక్కడ లేదు అని,కేవలం కొన్ని రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తూ రైతులని రెచ్చగోడ్తున్నారని మరియు ఈ చట్టాలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

మరియు ఇప్పుడున్న మార్కెట్లు రైతులందరికీ అందుబాటులో లేవు అని అందుకే నూటికి 65% రైతులు పంటని లోపాయాకంగా దళారుల చేతుల్లో పెడ్తున్నారని అందువల్ల రైతుల కన్నా ఎక్కువగా దళారులు లాభాపడ్తున్నారని దానిని అరికట్టాలని అయన చెప్పారు.ఎప్పుడైతే ఒక రైతు తనకి పండిన పంటని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాడో అప్పుడే అతను ఈ దళారుల చేతుల్లో నష్టపోకుండా లాభ పడుతాడని...కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ రైతు బిల్లులు ఆ వెసులుబాటు రైతులకు కల్పిస్తుందని అయన చెప్పుకొచ్చారు.

దేశంలో రైతులు ఎక్కడ లేనట్లుగా కేవలం పంజాబ్ లోని రైతులే ఎందుకు ఈ బిల్లులకు వ్యతిరేకిస్తు ఉద్యమిస్తున్నారో అర్ధం కావట్లేదు అని,అంటే దేశంలోని రైతులందరూ మూర్కులు అని వారు అనుకుంటున్నారా అని అయన ప్రశ్నించారు.చివరిగా రైతులు ఎవరు తప్పుడు ప్రచారాలని విని భయందోలనలకు గురికావోద్దని,ఈ బిల్లుల ద్వారా రైతులకు లాభమే కాని నష్టం ఉండదు అని చెప్పారు.

Comments

Post a Comment