Skip to main content

తెలంగాణా లో రైతుల ఆవేదన,ఎకరాకి 5000 ఇచ్చి 50000 నష్టం చేసాడని వాపోతున్న రైతన్నలు

 తెలంగాణా:రైతుల ఆవేదన,ఎకరాకి 5000 ఇచ్చి 50000 నష్టం చేసాడని వాపోతున్న రైతన్నలు


తెలంగాణా రాష్ట్రం లో రైతుల పరిస్థితి అత్యంత దాయనియంగా మారింది.అయితే ఈ సంవత్సరం కరోన వల్ల యావత్ ప్రపంచం అల్ల కల్లోలం ఐన విషయం అందరికి తెలిసిందే...అయితే ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ,,కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు గారు నియంతృత్వ వ్యవసాయ విదానాన్ని అమలు చేస్తూ రైతులందరూ సన్న రకపు వడ్లు పండించాలని మరియు మక్క జొన్నలు ఎట్టి పరిస్థితులలో వేయకూడదని ఆంక్షలు విదించి,ఒకవేళ సాగుచేస్తే రైతుబందు ఇవ్వడం జరగదు అని రైతులని భయపెట్టిన విషయం మన అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ క్రమలో రైతులకు సన్న రకానికి కావాల్సిన ధర విషయంలో వొచ్చిన సందేహానికి రాజకీయ నాయకుల నుండి సానుకూల సమాదానం వొచ్చినట్లుగా అందరికి తెలిసిన విషయమే.

ఇది ఇలా ఉండగా సన్న రకపు వడ్లు సాగుచేస్తే పెట్టుబడి ఎక్కువ వస్తుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతులందరూ సన్న రకపు వడ్లను సాగుచేయడం జరిగింది...అయితే వరి కోతలు జరిగి 2 నెలలు దగ్గరికి కావొస్తున్న ప్రభుత్వం ఇస్తానని చెప్పిన మద్దతు రేటు పక్కన పెడితే కొనే నాదుడు లేదని రైతన్నలు మనోవేదనకు గురవుతున్నారు.పలు చోట్ల రైతులు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లుగా కూడా అనిపించకపోవడం రైతులను ఇంకా మనోవేదనకు గురి చేస్తున్న విషయం.

ఇందులో ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన సన్న రకపు వడ్లు కొనకుండా దొడ్డు రకపు వడ్లు కొనడం.సన్న రకం వడ్లు సాగుచేసిన రైతులకు కనీసం కొనుగోలు కేంద్రాలలో బస్తాలు కూడా ఇవ్వకపోవడం,రేపు రా మాపు రా అని రైతులని పలుమార్లు తిప్పించుకోవడం రైతులని ఆందోళనకి గురి చేస్తున్నాయి.

ఇందులో ఈ మధ్యే మొదలైన నీవర్ తుఫాను కారణంగా చాల మంది రైతులు కేవలం కొనుగోలు కేంద్రాలు కూనుగోలు చేయలేదనే కారణంతో నష్టపోయారు.ఎకారాకి రూ,,5000 ల రైతుబందు ఇచ్చి రూ,,50000 ల నష్టపోయేలా చేసారని రైతులందరూ వాపోతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి సన్న రకపు వడ్లకు ఇస్తానని చెప్పిన మద్దతు ఇచ్చి కొనుగోలు చేస్తుందా లేక ఇలాగే చూసి చూడనట్లుగా వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.

Comments